Home హాట్ న్యూస్ సామాజిక సమానత్వమే జగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి.
హాట్ న్యూస్

సామాజిక సమానత్వమే జగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి.


పియూసీ చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి

-అంబేద్కర్, జగ్జీవన్ రాం లే మాకు ఆదర్శం

-జగ్జీవన్ స్పూర్తితోనే దళిత బంధు పథకం

-ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం ఇదే

ఆశన్నగారి జీవన్ రెడ్డి

నిజామాబాద్, ఏప్రిల్5:- తెలంగాణ వార్త
అంటరానితనాన్ని పారద్రోలి సామాజిక సమానత్వం సాధించడమే బాబూ జగజ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్ రామ్ సామాజిక మార్పుకోసం అంకుటిత దీక్షతో పోరాడిన భరత మాత ముద్దు బిడ్డ అని అభివర్ణించారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు
పీడిత తాడిత అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ భావితరాలకు స్ఫూర్తి ప్రధాత అని ఆయన పేర్కొన్నారు.
“ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవిం చాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్‌ రామ్‌ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు. దీంతో ఆగ్రహించిన జగజ్జీవన్ ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలుముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్‌ రామ్‌ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.జగ్జీవన్‌ రామ్‌ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు.అంతటి కష్టకాలంలోనూ కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లింది. 52 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యులుగా వున్నారు. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు దేశంలో సామాజిక సమానత్వ ఉద్యమాలకు దారి చూపాయి. దళితుల హక్కులను రాజ్యాం గంలో అంబేడ్కర్‌ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది.
అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్‌రామ్‌” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు
అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్
జగ్జీవన్ స్పూర్తితోతో దళిత బంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. దళిత బంధు ప్రపంచంలో నే అతి పెద్ద నగదు బదిలీ పథకం అని ఆయన అన్నారు. చాలామంది దళిత వర్గాల వారు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటిని వెంటనే జిల్లా మంత్రి, కలెక్టర్ కు నివేదించి పరిష్కరిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page