Home హాట్ న్యూస్ జగజ్జీవన్ రామ్ ఆశయసాధన కోసమే దళితబంధు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మహాశక్తి కేసీఆర్.
హాట్ న్యూస్

జగజ్జీవన్ రామ్ ఆశయసాధన కోసమే దళితబంధు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మహాశక్తి కేసీఆర్.

పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

-119నియోజకవర్గాల్లో వివక్ష లేకుండా దళిత బంధు అమలు

-అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మహాశక్తి కేసీఆర్

-దేశంలోనే దమ్మున్న సీఎం

-నిజమైన రైతుబంధు,దళిత బంధు ఆయనే

-ఇలాంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా?

-జీవన్ రెడ్డ

-‘దళిత బంధు’ లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ

హైదరాబాద్, ఏప్రిల్5:-తెలంగాణ వార్త
బాల్యం నుంచే అణుగారిన వర్గాల వారి అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయసాధన కోసమే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకానికి రూపకల్పన చేశారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం దళిత బంధు లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , ఆర్టీసీ చైర్మన్,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, ఎమ్మెల్సీలు వీజి గౌడ్, రాజేశ్వర్ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని 119 నియోజకవర్గాల్లో ఎలాంటి వివక్ష, అవకతవకలు లేకుండా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.
“అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మహాశక్తి కేసీఆర్. దేశంలోనే దమ్మున్న సీఎం. నిజమైన రైతుబంధు,దళిత బంధు ఆయనే. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నియోజకవర్గంలో కూడా పైలెట్ ప్రాజెక్టు గా దళిత బంధు అమలు జరుగుతోంది. కేసీఆర్ కు తనమన భేదం లేదు. ప్రతి ఒక్క దళితుడికి మంచి జరగాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన చేతికి ఎముక లేని మనసున్న మహారాజు” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్ని పథకాలు వచ్చాయో ఈ ఎనిమిదేండ్లలో అన్ని పథకాలు వచ్చాయన్నారు. ఇలాంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశంలో 40కోట్ల మంది దళితులకు కేంద్ర బడ్జెట్ లో కేవలం రూ12 వేల కోట్లను మాత్రమే కేటాయిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని దళితులకు రూ.17వేల కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ దన్నారు.” చదువుకునే రోజుల్లో నుంచే అంటరానితనాన్ని ఎండగట్టి సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధుడు బాబూ జగజ్జీవన్ రామ్. దళితుల అభ్యున్నతి గురించి ఆయన కన్న కలలను సాకారం చేయడానికే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే. కేసీఆర్ ముందు చూపున్న నేత. ఉద్యమకారుడిగా అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సీఎంగా పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేసి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సాధించారు. ఇప్పుడు జగజ్జీవన్ రామ్ ఆశయసాధన కు నడుం బిగించి రైతుబంధు వంటి పథకాల ద్వారా సామాజిక మార్పుకోసం పాటుపడుతున్నారు” అని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా కలెక్టర్ నారాయణ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొంటూ దళిత బంధు పథకం నిధులు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో చేరి అవి సద్వినియోగం అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page