తెలంగాణ రాష్ట్ర సమితి నందిపేట్ పార్టీ అధ్యక్షుడు మచర్ల సాగర్ శనివారం రోజు ఎమ్మెల్యే పి సి చైర్మన్ నీ హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు .ఆర్మూర్ పట్టణం నుంచి రెండు సార్లు గెలిచి మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రజలకు శ్రీరామరక్షగా వెలుగొందాలని నిస్వార్ధంగా ఒక్క రూపాయి లాభాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమం వారి యొక్క అభివృద్ధి అజెండా గా భావించే నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి ఆర్మూర్ నియోజకవర్గం ప్రజల తరఫున టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తరుపున మచర్ల సాగర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
Leave a comment