Home హాట్ న్యూస్ వచ్చే ఎన్నికల్లో 70 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు అవుట్?
హాట్ న్యూస్

వచ్చే ఎన్నికల్లో 70 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు అవుట్?

తెలంగాణ అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు బిజెపి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరాద ను కుంటున్న నేతలకు ఇప్పటి నుంచే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, ఈ మేరకు పక్క చూపులు చూస్తున్నారు, వ్యతిరేకతను మూటగట్టు కొన్న నేతలను ఇతర పార్టీలోకి పంపించి కొత్తవారికి బరిలో దింపి గెలిపించుకోవాలని, సెట్టింగ్లను బయటకు పంపితే ఎంతోకొంత ఓట్లు చీల్చితే తమకే కలిసొస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ తో చర్చిస్తూ అందరి ఎమ్మెల్యేల జాతకాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు సీఎం దృష్టికి 70 మంది ఎమ్మెల్యే ల కు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 70 మంది ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ తో సరిగా టచ్ లో ఉండటం లేదని తెలిసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వారిపై వ్యతిరేకతను పెంచుకున్నారు. ఎన్నికల సమయంలో మాదిరి ఈ పరిస్థితి ఇప్పుడు లేకపోవడం , ప్రత్యామ్నాయ నాయకులు ఎదగటం ఈ నేపథ్యంలో సిట్టింగ్ లకు గండం పొంచి ఉన్నది. వీరికి అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే వివరాలు సైతం అంచనా వేస్తున్నారు. దీనికోసం కొత్త కొత్త సర్వే బృందాలను రంగంలోకి దింపారు. అటు ప్రభుత్వ నిఘా వర్గాలు ఓవైపు నాగపూర్ , యు పి నుంచి ప్రైవేట్ సర్వే టీములను మరోవైపు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరు ప్రజలు ఎలాంటి చర్చ జరుగుతుందని అంశాలపై దృష్టిపెట్టారు. సంక్షేమ పథకాల అంశాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యేల తీరుపై ఈ సర్వే చేయడం విశేషం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈసారి కూడా కేసీఆర్ నాయకత్వంలోని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు, కానీ చాలా నియోజకవర్గాల్లో కెసిఆర్ సంక్షేమ పథకాలు కలిసిరావడంలేదు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రతి బంధకం గానే మారుతున్నది. ఈ క్రమంలో లో టికెట్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం ఈ విషయమై ఇప్పటికే బహిర్గతం అవడంతో అనుమానాలున్నా సెగ్మెంట్ల నుంచి కొత్త నేతలు కెసిఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page