ఎల్బీనగర్ (తెలంగాణ వార్త) ఈ రోజు ఎల్.బి. నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్ పంకజ గారు జోనల్ అధికారులతో మరియు సర్కిల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
1. రంజాన్ పండుగ
రంజాన్ పండుగ పురస్కరించుకుని హళ్ళెం తయారీ దారులు వారి బట్టిలను గ్రౌండ్ ఫ్లోర్ (గ్రౌండ్ లెవెల్) యందు మాత్రమే ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ మరియు ఇతర ఫ్లోర్ యందు ఏర్పాటు చేయరాదు అని వెటర్నరీ అధికారులను పర్యవేక్షణ చెయ్యాలి అని ఆదేశించారు.
రంజాన్ పండుగ సందర్భంగా మస్జీద్ల వద్ద ఏర్పాటు, శానిటేషన్ మరియు ఇతర పనులు వెంటనే చేపట్టాలని అని ఆదేశించారు.
రంజాన్ గిఫ్ట్ పాకెట్స్ మస్జీద్ కమిటీ ద్వారా నిరుపేద కుటుంబాలకు చేరేల జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు.
2. ఎన్ఆర్ ప్రాపర్టీస్ సర్వే మరియు గోడౌన్ల సర్వ్
రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ యుసేజి గా వాడుతున్న బిల్డింగ్ లను వెంటనే సర్వే పూర్తి చేయాలని కోరారు.
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కమిషనర్ గారి అదేశం ప్రకారం గోడౌన్ సర్వే కూడా త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
3. డిసిల్టింగ్ వర్క్స్
రానున్న వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని నాలల వద్ద డిసిల్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అట్టి పనుల్లో కార్పొరేటర్లుకు సమాచారం ఇచ్చి వారిని కూడా బాగస్వామ్యులు చేయాలని ఆదేశించారు.
4. నాల ఆడిట్
ఎల్.బి. నగర్ జోన్లో ఉన్న నాలల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి యొక్క పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
5. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్
ఈ నెల 29.04.2022 నాడు ఉప్పల్ స్టేడియం యందు ఎల్.బి. నగర్ జోన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ప్రారంభం కానున్నాయి మరియు వచ్చే నెల 27.05.2022 నాడు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పూర్తి అవుతాయి. కావున ఈ క్యాంప్స్ కావలసిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
6. ఎర్లీ బర్డ్ ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్.
కమిషనర్ గారు ఎల్.బి. నగర్ జోన్ కు ఎర్లీ బర్డ్ ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ క్రింద రూ.79.34 క్రోర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. కావున డిప్యూటీ కమీషనర్ లు ఎర్లీ బర్డ్ టార్గెట్ కలెక్షన్ వసూలు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. బి. ప్రసాద్ రావు, సీపీ, శ్రీ. రాజ్ కుమార్, డిడి (యుబిడి), డిప్యూటీ కమీషనర్ లు శ్రీ. ఎన్. శంకర్, కాప్రా, శ్రీమతి. అరుణ కుమారి, ఉప్పల్, శ్రీ. ఏ. మారుతి దివాకర్, హయత్ నగర్, శ్రీ. బి. సురేందర్ రెడ్డి, ఎల్.బి.నగర్, శ్రీ. హెచ్. కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, వెటర్నరీ అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Leave a comment