Home హాట్ న్యూస్ బిసీల కుల గణన కోసం బీసీల సభ ఏర్పాటు.
హాట్ న్యూస్

బిసీల కుల గణన కోసం బీసీల సభ ఏర్పాటు.

ఆర్మూర్ తెలంగాణ వార్త తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జక్రాన్ పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో శుక్రవారం బిసీల కుల గణన కోసం బీసీల సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ
గ్రామాలలో బీసీల గురించి అవగాహన సదస్సు కోసం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చాలా పెద్ద మనుషులు బీసీల గురించి రావడం అనేది పెద్ద గొప్పగా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.
అదేవిధంగా మార్చి 21 ,22 ,23 తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అధ్వర్యంలో ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద జరిగినటువంటి బిసి కులం కోసం ధర్నాలు విజయవంతం చేసుకొని వచ్చామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఒక వేళ కేంద్ర ప్రభుత్వం కాక కుల గణన కోసం కాకపోతే జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిజాంబాద్ జిల్లా నుండి వెయ్యి మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మందితో పార్లమెంటును ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
బీసీల పైన దాడి జరిగిన బీసీల పై చిన్నచూపు చూసినా కూడా ఊరుకోబోమని బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బీసీల గుణగణ కోసం నిర్వహించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్సీ ఎస్టీలకు వారి కుల దామాషా ప్రకారం వారికి వాటా వస్తుందని,అదేవిధంగా ఓసీలకు కూడా మొన్న 5 శాతం కోసం వారికి ప్రకటించడం మరి బీసీలపై ఈ చిన్న చూపు చూడడం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా 2633 బీసీ కులాలు ఉన్నాయి అని వారి ప్రతికూలాలను లెక్కించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.ప్రతి గ్రామీణ ప్రాంతాలలో బిసి కులాల కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామం గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్క బీసీ కుల నాయకులు పెద్ద మనుషులు మాట్లాడే బీసీల గురించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా విద్య,వైద్య, ఉద్యోగ రంగాలలో బిసి 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి నర్సయ్య. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రెటరీ సత్యా గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చొప్పరివినోద్,మరియు విక్రమ్ పల్లి మండల గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని సందర్భంగా తెలియజేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page