టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్ ఘాటు వాక్య.
ఆర్మూర్, తెలంగాణ వార్త:
ఈరోజు MLA క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశ సందర్భంగా TRS సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్ BJP నాయకులకు తీవ్రంగా హెచ్చరించినారు పండిత్ ప్రేమ్ మాట్లాడుతూ నిన్న ఏదైతే బీజేపీ సభ విజయవంతం ఐనదని మిఠాయిలు పంచుకుని పాత్రికేయ సమావేశం నిర్వహించి మ డైనమిక్ MLA జీవనన్న గారిని విమర్శించడం సరికాదన్నారు మీరు మిఠాయిలు పంచుకోండి ముతులు నాక్కొండ్రి కానీ మా జోలికి రావద్దని పేర్కొన్నారు TRS పార్టీ ఇటువంటి సభలు వందల సభలను నిర్వహించిందని ,కేవలం 22 ఎకరాల సభ స్థలంలో ప్రధానితో పాటు దేశ నాయకులతో కలిసి సభ నిర్వహించి విజయవంతం అయుందంటే TRS పార్టీ KCR గారి ఆధ్వర్యంలో కొంగరాకలన్ లో నిర్వహించిన సభ 2000
రెండు వేల ఎకరాలలో చెప్పటి దేశంలోనే అతిపెద్ద సభ నిర్వహించిన ఘనత కేసీఆర్ గారికి చెందిందని తెలిపినారు, ఇకపోతే మొన్ననే బీజేపీ పార్టీలోకి చేరిన ఐరెన్ లెగ్ కంచెట్టి గంగాధర్ కు తీవ్రంగా హెచ్చరించారు,డైనమిక్ MLA జీవనన్న గారికి పదే పదే విమర్శిస్తే నాలుక కొస్తామని అన్నారు, ముందు మీ భార్యతో TRS పార్టీపై గెలిచిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు, అభివృద్ధిపై మాట్లాడడానికి ఆర్మూర్ నడిబొడ్డున అంబేద్కర్ చౌరస్తాలో MP అరవింద్ రావాలని డిమాండ్ చేశారు, నీవు మున్సిపల్ చైర్మన్ ఉన్న కాలంలో నీవు కబ్జాలు చేసిన భూమిలో జీవనన్న గారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రజలకు అందించిన ఘనత జీవనన్న గారిదని తెలిపారు, ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేలకోట్ల రూపాయలను తీస్కొచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు, కంచెట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గోడవులు, గ్రూపులని విమర్శించారు, కంచెట్టి ఎవరిదగ్గర పనిచేస్తారో వారినే విమర్శిస్తాడాని అన్నారు ఆయన గత చరిత్ర తెలుసుకోవాలని అన్నారు,
జీవనన్న అంటే ప్రాణమిచ్చే TRS కార్యకర్తలున్నారని అది తెలుసుకొని మాట్లాడాలని అన్నారు రానున్న ఎన్నికల్లో జీవనన్న గారు 50000.యాభై వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారు అని అన్నారు, ఇట్టి సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను గారు TRS సీనియర్ నాయకులు పోల సుధాకర్, సుంకరి రవి, జనార్దన్ గౌడ్, GG రామ్, దొండి శమ్, బిజ్జు సంతోష్ కౌన్సిలర్ ప్యాయజ్,లింగంపల్లి శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు…
Leave a comment