Home హాట్ న్యూస్ కౌండిన్య హాస్పిటల్ ఘటనలో ఐదుగురు అరెస్ట్.
హాట్ న్యూస్

కౌండిన్య హాస్పిటల్ ఘటనలో ఐదుగురు అరెస్ట్.

 • అరెస్ట్ అయిన వారిలో హాస్పిటల్ ఎండి, అతని భార్య సైతం
  ఉప్పల్, ప్రతినిధి: తెలంగాణ వార్త:
  మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన కౌండిన్య హాస్పిటల్ ఘటనలో పోలీసులు మరో ఐదుగురిని అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. ఇందులో హాస్పిటల్ ఎండి పాండురంగ గౌడ్, అతని భార్య మమత, హస్పిటల్ హెచ్ ఆర్ అన్వేష్, ల్యాబ్ టెక్నిషియన్ నరేష్, డాక్టర్ పద్మలను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే కర్మన్ ఘాట్ కి చెందిన కొత్తగడి కవిత (32) ప్రవీణ్ కుమార్ తో 10 సంవత్సరాలు క్రితం వివాహం జరగగా వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి. ఈ మధ్య ఆమె అబ్దుల్లాపూర్ మెట్ తిమ్మాయిగూడెంలోని పుట్టింటికి వచ్చింది.గత నెల 25న
  రాత్రి 7 గంటల సమయంలో ఆమెకు బ్లీడింగ్ అవుతుందని, గౌరెల్లి గ్రామంలోని అర్ ఎం పీ డాక్టర్స్ అయిన శంకర్, నిరూపమ లను సంప్రదించారు. వారు మేడిపల్లి బోడుప్పల్ లోని కౌండిన్య హాస్పిటల్ ను నడుపుతున్న వారి దగ్గరికి పంపిస్తా అని హాస్పిటల్ వారికి ఫోన్ చేయగా హాస్పిటల్ తరపున కారులో తీసుకొని అడ్మిట్ చేసుకున్నారు. 26న ఉదయం కవితను ఆపరేషన్ థీయేటర్ కి తీసుకొని పోయి ట్రీట్ మెంట్ చెయ్యడం మొదలు పెట్టారు. అయితే మద్యహన్నం సమయంలో కవితను డాక్టర్స్ ఆపరేషన్ థీయేటర్ రూమ్ నుండి తీసుకొని వచ్చి రూమ్ లో బెడ్ పైన వేసి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు వెళ్ళిచూసేసరికి అప్పటికే కవిత చనిపోయి ఉన్నది. హాస్పిటల్ లో డాక్టర్స్, సిబ్బంది అందరూ హాస్పిటల్ నుండి పారిపోయినారు. ఆపరేషన్ రూమ్ లో చెత్త బుట్టలో ప్లాస్టిక్ కవర్లో చిన్న బేబీ పిండం ఉంది. కవితకు వివరితంగా బ్లీడింగ్ అయినట్టు మనవాళ్లు కనిపించాయి.
  హాస్పిటల్ నడుపుతున్న పాండురంగ గౌడ్, అతని భార్య మమత హాస్పిటల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కవితకు అబార్షన్ చేసి ఆమె చావుకి కారణం అయ్యారని విచారణలో వెల్లడయింది
  అట్టి కౌండిన్య హాస్పిటల్ కు ఎటువంటి పర్మిషన్ లేదు అని, పాండురంగ గౌడ్, అతని భార్య మమత లు నకిలీ డాక్టర్స్ అని తెలిసింది. కౌండిన్య హాస్పిటల్ ఆపరేషన్ థీయేటర్ నందు సరైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవని, చికిత్స చేస్తే ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా కవితకు అబార్షన్ చేసి ఆమె చావుకి కారణం అయ్యారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాది చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే
  ఇట్టి హాస్పిటల్ కి రిఫర్ చేసిన ఆర్‌ఎం‌పి డాక్టర్ శంకర్ ను ఇప్పటికే కోర్టుకు రిమాండ్ చేయగా మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ గోవర్ధనగిరి తెలిపారు.
  పాండురంగ గౌడ్ తన భార్య మమత తో కలిసి నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ లో జిపిఆర్ క్లినిక్ అండ్ ట్రస్ట్, హాస్పిటల్ నడిపించినట్లు పేర్కొన్నారు. క్లినిక్ నడిపేటప్పుడు చుట్టూ పక్కల ఉన్న ఆర్ఎంపి డాక్టర్లతో పరిచయాలు పెంచుకొని వారికి కమిషన్ ఇస్తానని చెప్పి రప్పించుకునేవాడని చెప్పారు. ఇందుకు ఆర్ఎంపీ డాక్టర్లకు కమిషన్ ఇస్తుండేవాడని వివరించారు.
  డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో పాండురంగ గౌడ్ కి ఎలాంటి ధ్రువీకరణ సర్టిఫికెట్స్ లేకుండా ప్రభుత్వ నియమ నిబంధన ఉల్లంఘించి లేకపోయినా హాస్పిటల్ నడిపిస్తూ అమాయక ప్రజలను మోసం చేయడం శోచనీయం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page