హైదరాబాద్, తెలంగాణ వార్త .::పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ డ్రా పద్ధతిన ఆయా శాఖలకు బదలాయింపు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కోనసాగినది.
రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టర్ ఛాంబర్ జిల్లా అధికారులు, రెవిన్యూ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్ తో సహా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేసినారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా పద్దతిలో కేటాయింపులు జరిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ. నెం. ms. NO.121,
తేదీ :23.07.2022, సర్క్యులర్ మెమో. నెం.1634052-B/186/A1/HRM /VII /2022, తేదీ :26.07.2022 ప్రకారం శాఖల వారిగా
జిల్లాలో మొత్తం 274 మంది వీఆర్వోలను 40 శాఖల్లో సర్దుబాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ, ఏ ఓ ప్రమీల, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీధర్, సిపిఓ ఓం ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Leave a comment