Home హాట్ న్యూస్ ఆర్మూర్ గడ్డ అభివృద్ధికి అడ్డా..
హాట్ న్యూస్

ఆర్మూర్ గడ్డ అభివృద్ధికి అడ్డా..

తెలంగాణ వార్త : ఆర్మూర్ గడ్డ అభివృద్ధికి అడ్డా అని, అనేక పథకాల అమలులో30 అగ్రగామిగా పురోగమిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన డొంకేశ్వర్ మండలంలోని మొత్తం13 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల వారు సోమవారం జీవన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి డొంకేశ్వర్ మండలం ఏర్పాటు చేయించినందుకు ఆయన కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు జీవన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజక వర్గమంటేనే ఒక చరిత్ర అని పేర్కొన్నారు.2013లో మెత్తం119 స్థానాలలో టీఆర్ ఎస్ మొదటి తన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసిందన్నారు. తొలి ఎన్నికల్లో 15వేల ఓట్లతో, రెండోసారి 30వేల ఓట్ల తో గెలిచానన్నారు.
ప్రజల ఆశీస్సులతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆర్మూర్ నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ గా మార్చి ప్రజల30ఏండ్ల కలను సాకారం చేశాం. వంద పడకల ఆసుపత్రి సాధించి 30 ఏండ్ల ఆకాంక్ష ను నెరవేర్చాము. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 20వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయి. మరో 20వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్ ద్వారా వైద్య సహాయం అందించాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తూ ఆర్మూర్ ప్రజల 70ఏండ్ల కోరికను నెరవేర్చాము. 9 బైపాస్ రోడ్లు వేసి ప్రయాణ దూరాన్ని తగ్గించాము. సిద్ధులగుట్టకు 20కోట్లు ఖర్చు చేసి ఘాటు రోడ్డు నిర్మించాం. ఇది సంపూర్ణ రైతు ప్రభుత్వం. ముంపు గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూములకు నష్టం జరుగుతుందని చెప్పిన వెంటనే రోడ్డు నిర్మాణం పనులు నిలిపివేయించాం.
రైతులకు నష్టం చేసే ఏ పని ఈ ప్రభుత్వం చేయదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే డొంకేశ్వర్, ఆలూరు మండలాల ఏర్పాటు జరిగింది.
కొత్త మండలాల్లో ప్రజలకు పాలన మరింత చేరువ కానున్నది. ఒక పోలీసు స్టేషన్,30 పడకల ఆసుపత్రి, వంద మంది కి పైగా అదనపు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వస్తారు. డొంకేశ్వర్ మండలం కావాలని మొత్తం13 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఆ గ్రామాల ప్రజలకు అభినందనలు.
డొంకేశ్వర్ మండలాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రులు కేటిఆర్ ,వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కవితలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయకుడు ఛాయా చందు, వీడీసీ క్యాష్యేర్లు వెంకటేష్, డీ స్వామి, వీడీసీ సభ్యులు, పీఏసీ ఎస్ చైర్మన్ భారత్ రెడ్డి, డైరెక్టర్ లు పెంటన్న,రాజన్న, లిఫ్ట్ వైఎస్ చైర్మన్,గంగారాం, టీఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్, ఎస్ సీ సెల్ మండల అధ్యక్షుడు పొగరి సంజీవ్ యూత్ అధ్యక్షుడు సతీష్,భూమగౌడ్, అశోక్ గౌడ్,గోక భోజ రెడ్డి ,మల్లారెడ్డి, గ్రామ యువకులు, సీనియర్ నాయకులు పాల్గోన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page