హైదరాబాద్, తెలంగాణ వార్త: వ్యాపారం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ…..అది లక్షలతో కూడిన వ్యవహారం. పైగా.., మహిళలు ఇలా వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు. ఇందుకే ఇలాంటి వారంతా ఏవో చిన్న చిన్న జాబ్స్ కి పరిమితం అయిపోతున్నారు. లేదా? వంటింటికి పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది…
ఈ పథకంలో ఒక్కో మహిళకి వడ్డీ లేకుండా రూ.3,00,000 లోన్ లభిస్తుంది. దీంతో.., వారు పూర్తిగా తమకి ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి వ్యాపార ఆలోచనలు లేకుంటే.. ఈ విషయంలో కూడా మీకు సహకారం అందిస్తారు.
అగర్బత్తీ తయారీ, బేకరీ, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, క్యాంటీన్, కేటరింగ్, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ వంటి 88 రకాల వ్యాపారాలకి శిక్షణ ఇవ్వడానికి కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. మీరు కనుక ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుంటే మీకు అతి సులభంగా లోన్ లభిస్తుంది.
‘ఉద్యోగిని’ స్కీమ్ లో లోన్ తీసికోవడానికి ఎవరు అర్హులు? ఈ లోన్ ఎలా అప్లై చేయాలన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఈ రుణాలను పొందడానికి అర్హులు. కానీ.., వారి కుటుంబ వార్షికాదాయం రూ.1,50,000 లోపు ఉండాలి.
అంత కన్నా ఎక్కువ ఉంటే ఈ రుణాన్ని పొందటానికి అర్హులు కాదు. కానీ.., మహిళలు గనుక.. వితంతువు, వికలాంగులు అయితే వారికి వార్షికాదాయం లిమిట్ వర్తించదు.
రీజనల్ రూరల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఈ రుణాలను అందిస్తున్నాయి. మీరు ఈ బ్యాంక్ లకి వెళ్లి ‘ఉద్యోగిని’ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తుండటం విశేషం. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో అన్నీ ఆర్ధిక కష్టాలను అధిగమించవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం త్వరగా వడ్డీ లేని ఈ ఋణం కోసం అప్లై చేసుకోండి.
మీకు ఏమైనా
Leave a comment