నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల కేంద్రంలోని స్థానిక ఉప సర్పంచ్ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర వజ్రోత్సవాల భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగరవేరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు మరియు గ్రామ పెద్దలు పిల్లలు పాల్గొనడం జరిగింది.
Leave a comment