ఆర్మూర్ ,తెలంగాణ వార్త :రక్షా స్వచ్చంధ సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యములో బుధవారం ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని కోరుతూ ఉచితంగా మట్టి గణపతుల విగ్రహాలను పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టర్ అఫ్ ప్యాలస్ (POP) వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు వుందని తెలియచేస్తూ, ప్రజలకు పర్యావరణ పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. స్వచ్చంధ సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ప్రతీ సం,, లాగానే ఈ సం,, కూడా సంస్థ తరపున వినాయక చవితి పండుగ సందర్బంగా భక్తులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్సులు Dr బేతు గంగాధర్, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శి ఖాందేష్ సత్యం, మక్కల సాయినాథ్, మీరా శ్రావణ్ సభ్యులు శ్రీను రాజేష్, స్నేహ శ్రావణ్, వినోద్, సంతోష్, రమేష్, మహేష్, రాకేష్, ప్రశాంత్, లింగం, నరేశ్, వెంకటి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment