ఆర్మూర్, తెలంగాణ వార్త:
ఆర్మూర్, తెలంగాణ వార్త: పట్టణంలో ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 200కు పైగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా యువజన సంఘం అధ్యక్షుడు ముక్క లక్ష్మణ్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్లాస్టర్ అఫ్ ప్యాలెస్ (pop) వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు ఉంటుందని తెలియజేస్తూ, సంఘ సభ్యులకు పర్యావరణ పరిస్థితులు గురించి అవగాహన కల్పించారు, వినాయకుడు యొక్క ఆశీస్సులతో అందరు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలి , కుటుంబ సభ్యులందరూ వినాయకుడు ఒక్క భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తమ్మీ శ్రీనివాస్, శ్రీ నగరేశ్వర ఆలయ అధ్యక్షుడు బాపు రాజ్,ముక్క ఆనంద్, బండారి నరేందర్, మర్యాల శ్రీనివాస్, వెంకటరమణ ,అల్లాడి వంశీకృష్ణ, తమ్మి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment