ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా యావత్తు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 వ తేది నాడు ఉపాధ్యాయులను సగౌరవంగా సన్మానించి కోవడం మన సంప్రదాయమని అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ మండలం లోని 13 ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి వారికి లయన్స్ క్లబ్ సర్టిఫికెట్లను మరియు మెమొంటో లను ప్రధానం చేయడం జరిగిందని సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన స్థానము ఉంటుందని వారి ద్వారా అనేక రంగాలలో విద్యార్థులు గొప్ప గొప్ప రంగాలలో ఉద్యోగాలను రాణించడం జరుగుతుందని గురువుకన్నా మించిన దైవం ఎది లేదని , గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని మనలో వున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపే అర్థం అని అధ్యక్షులు చేపూరు గణేష్, చార్టర్ ప్రెసిడెంట్ ప్రోగ్రాం చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతి లు పేర్కొన్నారు అనంతరం సన్మానం పొందిన ఉపాధ్యాయిని ఉపాద్యాయులు లయన్స్ క్లబ్ గ్రీన్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి భూసం ప్రతాప్ కోశాధికారి పోల్కం వేణు క్లబ్ ప్రతినిధులు ఆకుల రాజు, రాజుల దేవి రామకృష్ణ, గుజరాతి ప్రకాష్, అల్జాపూర్ రాజేష్, నరేందర్ టీచర్, దాచేపల్లి సంతోష్, నసీరుద్దీన్, నలంద ప్రసాద్. సన్మాన గ్రహీతలు బెంకి నారాయణ్ , కోంగి మనోహర్, డమంకర్ గంగామని, చౌల్ శివప్రసాద్,రవిచందర్,గాయత్రి,స్వప్నకుమారి,దయాసాగర్ ,
జడ్డు శ్రీనివాస్, సదానంద్,చిన్నయ తదితరులు పాల్గొన్నారు
Leave a comment