ప్రజా పోరాటాల్లో విధ్యార్థులు భాగస్వాములు కావాలి
PDSU ముఖ్య కార్యకర్తల సమావేశం లో
CPIML న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తన్న
.ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్లో PDSU ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి
PDSU ఆర్మూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షత వహించగా
ముఖ్య వక్తలు గా హాజరైన CPIML న్యూడెమోక్రసీ ఆర్మూరు సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తన్న PYL రాష్ట్ర నాయకులు సుమన్ లు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సమాజంలో విద్యార్థులందరూ ప్రశ్నించే దిశగా నడవాలని శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతూ సమాజంలో అసమానతలను రూపు మాపే దిశగా నడవాలని విద్యార్థులు ఉద్యమాల వైపు సామాజిక అసమానతలు రుపుమాపే వైపు ఈ సమాజ మార్పు కోసం కలిసికట్టుగా నడిస్తే ఈ వ్యవస్థ మారుతుందని అన్నారు, ఇంటర్ విద్యార్థులకు కరొనా నేపధ్యం లో పాఠాలను పూర్థిస్థాయి లొ చెప్పలేని పరిస్థితి లో నిర్వహించిన పరీక్షల్లో 51% విద్యార్థులను ఫెయిల్ చేసిన ఇంటర్ బోర్డ్ నిర్వాకం వల్ల విధ్యార్థులు ఆత్మహత్యల కు గురవుతున్నారని కావున తక్షణమే అందరిని ప్రమోట్ చేయాలని వారు డిమాండు చేశారు, PDSU లో పనిచేస్తున్న మీరు ప్రగతి శీల ఆలోచన తో విద్యారంగం ఎదుర్కుంటున్న సమస్యల పై పోరాడుతు ఆ క్రమం లోనె దోపిడి పీడన లేని సమ సమాజం కోసం జరిగే ప్రజా పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు .
ఈ సమావేశంలో PDSU ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ పట్టణ కేంద్రంలో గల వివిధ కాలేజీ కమీటిల నాయకులు ,వంశీ ,దేవిక దీపికా దుర్గ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
Leave a comment