నిజామాబాద్, తెలంగాణ వార్త: జాతీయ ప్రోగ్రెస్ జర్నలిస్టు యూనియన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అబ్బగోని అశోక్ గౌడ్ నియమిస్తూ శుక్రవారం రోజున జాతీయ ప్రోగ్రెసివ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు మాట్లాడుతూ అబ్బగొని అశోక్ గౌడ్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని , అబ్బగోని అశోక్ గౌడ్ జర్నలిస్టుల కోసం చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రెసివ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఉప్పు వీరాంజనేయులు తెలిపారు.
ఈ సందర్భంగా అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ
నాపై నమ్మకం ఉంచిన ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేయులు గారు మరింత పదవీ బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా జర్నలిస్టులపై దాడి జరిగితే ఊరుకోమని వారికి ఎప్పుడూ అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జర్నలిస్టులకు నాలుగో మూల స్తంభంగా గుర్తించి పెద్దపీట వేశారని అబ్బ గోని అశోక్ గౌడ్ గుర్తు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Leave a comment