Home హాట్ న్యూస్ మా తమ్ముడు జీవన్ రెడ్డి చెప్పిండు.. కేటీఆర్::
హాట్ న్యూస్

మా తమ్ముడు జీవన్ రెడ్డి చెప్పిండు.. కేటీఆర్::

: దండుమల్కాపుర్ గ్రామానికి ఇంచార్జ్ గా వ్యవరిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఈరోజు మంత్రి వర్యులు కేటీఆర్ గారికి అక్కడి గ్రామస్థులు 431 మంది భూమి కోల్పోయిన విషయాన్ని మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి, స్థలాన్ని కేటాయించాలని కోరారు. వచ్చే నెల 6వ తేదీ తర్వాత స్వయంగా వచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని గౌరవ మంత్రి వర్యులు కేటిఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.
నా తమ్ముడు జీవన్ రెడ్డి చెప్పిండు

-6వ తేదీ తరువాత నేనే స్వయంగా పట్టాలిస్తా

-ఇది మీ ప్రభుత్వం.. ఇది మీ కేసీఆర్ ప్రభుత్వం

-మేము ప్రజల కోసం బతుకుతాం.. ప్రజల కోసం చస్తాం

-మన లక్ష్యం మునుగోడు గెలవడం

-మనం గెలిచినాక ఏ గోడు ఉండదు

-మంత్రి కేటీఆర్

చండూరు, అక్టోబర్13- తెలంగాణ వార్త
మా తమ్ముడు ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.. పొద్దున అక్కడ ఇంచార్జ్ గా ఉన్న జీవన్ రెడ్డి నాకు ఒక మాట చెప్పిండు.భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులు ఇంటి జాగాకు స్థలాలు ఇవ్వాలని కోరారు అని. ఈ వేదిక మీద నుంచి నా తమ్ముడు జీవన్ రెడ్డి కి చెప్పుతున్న.. ఇది మీ..ప్రభుత్వం..మన ప్రభుత్వం.. ఇది కేసీఆర్ ప్రభుత్వం.. నా తమ్ముడు జీవన్ రెడ్డి కి చెపుతున్నా.. నవంబర్6 తరువాత కొత్తగా గెలిచే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మన నల్లగొండ జిల్లా మంత్రి, నా అన్న జగదీష్ రెడ్డి తో కలసి నేనే స్వయంగా వచ్చి ఆ నాలుగు వందల 31 మందికి ఇండ్ల పట్టాలిస్తా.. పట్టాలిచ్చే బాధ్యత నాది అని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టమైన హామీ ఇచ్చారు. చండూరు లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి గురించి ప్రశంసపూర్వకంగా పూర్వకంగా మాట్లాడారు. కాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల వెనుక నేపధ్యం ఏమిటంటే.. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ ఇంచార్జ్ గా ఉన్న ఆర్మూరు ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి దండు మల్కాపూర్ వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రజా ప్రతినిధులు, ప్రజలు జీవన్ రెడ్డి ని కలిసి చేసిన విన్నపం…మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత దేశంలోనే మొట్ట మొదటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కి మా అదృష్టంగా భావించి మాకు సంబంధించిన పట్టా, అసైన్డ్ భూముల సర్వే నంబర్753,754,755, 758,లలో 1.0 మరియూ 2.0 గుంటల భూమి హైవే కు ఆనుకొని ఇచ్చాం. 753,754,755లను మినహాయించి 758ని ప్రభుత్వ అధికారులు అవార్డు పాస్ చేశామని మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ అవార్డు పాస్ చేయడానికి తాము మాటపూర్వకంగా కానీ,రాత పూర్వకంగా కానీ ఎవ్వరికీ ఇవ్వలేదు. మా యందు దయ ఉంచి దయా హృదయం తో ఆ సర్వే నంబర్లను, మా స్థలాలను మాకే ఉంచాలని ఆ రైతులు జీవన్ రెడ్డి వద్ద ప్రాధేయ పడ్డారు. దీంతో కలత చెందిన జీవన్ రెడ్డి నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెంటనే మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నవంబర్ 6 తరువాత దండు మల్కాపూర్ రైతులకు నా తమ్ముడు జీవన్ రెడ్డి చెప్పిన విధముగా న్యాయం చేస్తామని ప్రకటించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page