Home జనరల్ <em>దేశ అభ్యున్నతి యువకుల చేతిలోనే… యువతలో చైతన్యం రావాలి.. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు</em>
జనరల్

దేశ అభ్యున్నతి యువకుల చేతిలోనే… యువతలో చైతన్యం రావాలి.. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

శుక్రవారం రోజు లింగంపల్లి డివిజన్ సురభి కాలనీ నుండి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకట్ భాను ,సాయిరాం ల మిత్ర బృందం మరియు కాలనీ వాసులు గతంలో బిక్షపతి యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధి, రవికుమార్ యాదవ్ గారి నాయకత్వానికి , నేడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని , కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని , రాబోయే ఎన్నికల్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు, సురభి కాలనీకి గతంలో మానాన్న గారు బిక్షపతి యాదవ్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ 8 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన , ఏ సమస్య వచ్చిన మీకు నేను, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వారికి హామీ ఇచ్చి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంట్స్తెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఏల్లేష్ , సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ , ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page