ఆర్మూర్, తెలంగాణ వార్త :శనివారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “అవ్వకు బువ్వ” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 56 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్దులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. త్వరలో సంస్థ తరపున ఉచిత ఐ క్యాంపు కార్యక్రమము నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు dr బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీరా శ్రావణ్, బండారి నరేశ్, సభ్యులు శరత్, సామంత్, ఖోడే శ్రీనివాస్, రాజు, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు …..
Leave a comment