Home జనరల్ దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…
జనరల్

దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…

నందిపేట్, తెలంగాణ వార్త::

తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ మరియు ALIMCO ( Artificial Limbs Manufacturing Corporation of India) ఆధ్వర్యంలో నవంబర్ 15 న మోడ్రన్ పబ్లిక్ పాఠశాల,ఖలీల్వాడి,నిజామాబాద్ నందు దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిభిరంలో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి,వారికి అవసరమైన ఉపకరణాలు గుర్తిస్తారని నందిపేట్ మండల విద్యాశాఖాధికారి పత్రిక ప్రకటన తెలిపారు .

శిభిరానికి హాజరయ్యే దివ్యాంగులు తీసుకుని రావాల్సిన ధ్రువపత్రాలు

1) ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
2) ఆదాయ ధ్రువీకరణ పత్రం /రేషన్ కార్డు జిరాక్స్ కాపీ
3) సదరం సర్టిఫికెట్ ( వైకల్యం 40% కన్నా ఎక్కువగా ఉండాలి.)
4) సదరం సర్టిఫికెట్ లేని వారు ప్రభుత్వ వైద్యుని దగ్గర సర్టిఫికెట్ పొంది, దానిపైన మండల విద్యాధికారి/ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రువీకరించి తీసుకురావాలి.
5) రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (వైకల్యం ఫొటోలో కనిపించే విధంగా ఉండాలి).
6) 0-18 సం. వయసు గల దివ్యాంగులు అర్హులు.

*ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేయబడును.మండలంలోని దివ్యంగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి శ్రీ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ క్యాంపుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మండల ఐ ఈ ఆర్ పి లు నగేష్ గౌడ్, ఫోన్ నెం. 9441516433, మరియు సంతోష్ కుమార్, 8688309140యందు సంప్రదించగలరని ఆయన చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page