Home జనరల్ నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం<br>• ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం
జనరల్

నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
• ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం

నిజామాబాద్/నందిపేట్. తెలంగాణ వార్త::

జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్ లో భాగంగా ఆదివారం స్థానిక మదర్శ లో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమవేశం లో నేర రహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్ ఐ 2 ఎం డి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు
నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్ ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని ఏస్ ఐ అన్నారు.

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని ఆయాన తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండలం లో కృషి చేస్తున్నామని చెప్పారు.సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
అదేవిధంగా గంజాయి ,డ్రాక్స్ జూదము లాంటి చెడు వ్యాసనాలకు యువతను దూరంగా ఉంచే విధంగా మజీద్ అధ్యక్షులు తమ తమ మజీద్ ఇమామ్ ల ద్వారా యువతకు ప్రబోధనాలు చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో నందిపేట్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్ మండల అధ్యక్షుడు ఖలీల్ మహమ్మద్ ముస్లిం కమిటీ సభ్యులు మజీద్ కమిటీ అధ్యక్షులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page