గచ్చిబౌలి (తెలంగాణ వార్త) బంగారు తెలంగాణలో పేదల బతుకులు 40 సంవత్సరాల వెనుకకు వెళ్లినట్టు ఈ దృశ్యం కనబడుతుంది ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ వచ్చిందని చెప్తుంటే మరోవైపు గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీ వెనకాల ఇంతటి ఘోరమైన బతుకులు పేదవారు జీవిస్తుంటే కెసిఆర్ బంగారు తెలంగాణ అని ఎలా అంటారు అని అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తీవ్రమైన చలి లో స్నానం చేయడానికి కి కట్టెల పోయి పై ఆయిల్ డబ్బా లో వేడి నీటిని కాచుకోవడానికి కట్టెలు లేక ఒక కట్టెతో నీటిని వేడి చేసుకొని స్నానం ఆచరించడానికి పిల్లలకు వేడినీటితో స్నానం చేయించడానికి తల్లి తాపత్రయం కెసిఆర్ కు కనబడడం లేదా పూరిగుడిసెలో చలిలో ఉంటూ కాలం గడిపేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అక్కడ అ గుర్తులు మీకు కనిపిస్తాయి. తెలంగాణ వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని అనుకున్న పేద కుటుంబీకులు ఇప్పుడు బోరున విలపిస్తున్నారు ఎమ్మెల్యే ఆరికె గాంధీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆ పేద రైతులు వాపోతున్నారు బంగారు తెలంగాణ కాదు కదా మా వద్ద ఉన్న బంగారం కూడా అమ్ముకుని ఇలా బతకవలసి వస్తుందని మేము అనుకోలేదని అక్కడి వారు అంటుంటే కెసిఆర్ కు గుర్తుకు రావడం లేదా పేద వారిని పక్కన పెట్టి ఉన్న వారికి భూములు సిలిండర్లు ఇస్తున్నారని వారన్నారు వచ్చే ఎన్నికల్లో తాము తెలంగాణ ప్రభుత్వానికి ఓటు వేసే ది లేదని వారు ఖరాఖండీగా చెప్పారు .బంగారు తెలంగాణ అంటే పేదవారు చేతినిండా పని కడుపునిండా అన్నం వస్తున్న అనుకున్నామని ఇప్పుడు పరిస్థితి చూస్తే 40 సంవత్సరాల క్రితం కట్టెలు వాడుకుందామని ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి వాడవలసి వస్తుందని వారన్నారు. కనీసం ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదని మీరు అంటున్నారు. కనీసం వారు నడిచే దారి కూడా మురికి కాలువ లు పారుతుంటే వాటి మీది నుంచి నడుచుకుంటూ బురదలో పనుల పండ్ల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. కనీసం మురికి కాలువలు కూడా నోచుకోని పేద ప్రజలు బంగారు తెలంగాణ ప్రభుత్వంలో మురికి కాలువల రోడ్డుపై నడవడం కెసిఆర్ నీకు ఇది తగునా.
Leave a comment