ఆర్మూర్ ( తెలంగాణ వార్త )
ఆర్మూర్: ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ ఆర్మూర్ లో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నజర్నలిస్ట్ కాలనీకి ప్రోత్సాహకంగా పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. హనుమాన్ ఆలయం వద్ద కాలనీవాసులు శ్రమదానంతో శుభ్రం చేసిన రోడ్లను, పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా మార్చిన పరిసరాలను ఆయన పరిశీలించారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్న కాలనీవాసులను ఎమ్మెల్యే అభినందించారు. కాలనీని అందంగా తీర్చిద్దుకుంటున్నారని, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. కాలనీలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.25 లక్షలు, ఓపెన్ జిమ్ కోసం రూ.అయిదు లక్షలు, రెండు కల్వర్టులు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంటనే ప్రతిపాదనలు రూపొందించి, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాలని పురపాలాక కమిషనర్ ను ఆదేశించారు. జర్నలిస్టు కాలనీని పట్టణంలో ఆదర్శ కాలనీగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. తాను స్థానికంగా ఉన్నపుడు స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. తమ కాలనీలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. తెరాస నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, పండిట్ పవన్, లింబాద్రి గౌడ్, మహేష్, సాగర్, జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, కాలనీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు కె.రాజు, రాజ్ కుమార్, సాయన్న, ఎస్సార్ఎస్పి డీఈ గణేష్, కాలనీ పెద్దలు గడ్డం శంకర్, ఎస్.గణపతి, ఎల్టీ కుమార్, భూమయ్య, నరహరి, జీవన్, మోహన్, భాజన్నతదితరులు పాల్గొన్నారు.
Leave a comment