ఆర్మూర్ తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని వర్ష అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగినట్లు ఎస్ ఐ శ్రీకాంత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే వర్ష అపార్ట్మెంట్లో ఉంటున్న రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి juggy బాయ్స్ ఆప్ 2 రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి బెంగళూర్ తమ బంధువుల దగ్గరికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన తెలుసుకున్న వారి తమ్ముడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 5 తులాల బంగారం కొంత నగదు దొంగలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు అలాగే దొంగలు ప్రీమియర్ అపార్ట్మెంట్ లో కూడా రెండు ఇళ్లను చోరీ చేయడానికి కి విఫల యత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు పండుగ పూట అందరూ ఇంటికి తాళం వేసి వెళ్లవద్దని పోలీసులు ప్రజలకు తెలుపుతున్నారు
Leave a comment