- ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై దాడి*
ఆర్మూర్(తెలంగాణ వార్త): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్థానికుల ప్రజల అభిప్రాయాల మేరకు డ్రైనేజీ సమస్యలు తీర్చాలని ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్ వెళ్లి కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు డ్రైనేజీ మరమ్మతులను చేయించడానికి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు అనంతరం అదే వార్డు కు చెందిన సత్తర్ర్ వ్యక్తి వైస్ చైర్మన్ ముందు తో అసభ్య పద drజాలం ft మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగారు అదే క్రమంలో వైస్ ఛైర్మన్ మున్ను పై సత్తార్ చెయ్యి కోవడం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారంగా వివరాలు ఇలా ఉన్నాయి.. గతంలో కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు వెడల్పు లో భాగంగా పాఠశాలకు ఆనుకొని ఉన్న కోకలను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కోకలను తొలగించే క్రమంలో సత్తార్ అనే వ్యక్తి అడ్డుకొని వాగ్వాదానికి దిగి కమిషనర్‌తో పాటు వారి సిబ్బందిని చంపేస్తాను అని బెదిరింపులు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు ఆ విషయంపై స్థానిక ఆర్మూర్ పోలీసులు గతంలో సత్తార్ పై కేసు నమోదు చేశారు ఇప్పుడు అంతకు మించి ప్రజా ప్రతినిధి ప్రముఖ ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్ పై చెయి చేసుకొనడం స్థానిక ప్రజలలో ఈ సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ సంఘటన తెలిసిన వెంటనే ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో సత్తార్ పై ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ పోలీసులు రంగంలోకి దిగి సత్తార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వెంటనే స్థానిక ఎస్ ఐ లు ఇరువర్గాల వారిని సముదాయించి బాధితులు అయినటువంటి మున్ను భాయ్ ను ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు సత్తార్ పై నాలుగు కేసులు విధించిన ఎస్సై శ్రీకాంత్ తెలిపారు
Leave a comment