ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణములోని చేనేత కాలనీలో వందేమాతరం యూత్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం వద్ద మహా చండి యాగం, హోమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమములో తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస ఖాందేష్ మరియు లీగల్ కౌన్సిల్ మెంబర్, మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ దంపతులు, Dr ఆడెపు ప్రభాకర్- శారద, ఖాందేష్ సత్యం-లత, భోగ గంగాధర్- రమా, గోక నరేందర్-శారద, నర్సారెడ్డి-లక్ష్మి, గంగా రెడ్డి-వసంత, గంగాధర్-నీరజ, సుధాకర్ దంపతులు మొదలగు దంపతులు చండి యాగములో పాల్గొని దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేసారు… ఈ కార్యక్రమములో మున్సిపల్ కౌన్సిలర్ వనం శేఖర్, చేనేత కాలోని అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, సభ్యులు నరేందర్, సత్యనారాయణ వందేమాతరం యూత్ ప్రతినిధులు అక్షయ్, గోక శరత్, విష్ణు, సంతోష్, సాయి, కిరణ్, శ్రీనివాస్, సన్నీ, బిట్టు, బన్నీ, భరత్, బబ్లు తదితరులు పాల్గొన్నారు
Leave a comment