తెలంగాణ వార్త: మేడ్చల్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. రఘునాథ్, ట్రెజరర్ మైస నాగరాజులను చైతన్యపురిలోని రజినీగంద కాంప్లెక్స్ ఎస్పీ లా కన్సల్టెన్సీలో హైకోర్టు న్యాయవాది పెందోట శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు పట్టుదలతో పనిచేసి న్యాయవాద వృత్తికి వన్నె తేవాలని సూచించారు. ఒక బెంచ్ మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రజాస్వామ్యనీకి , సామాన్యునికి రక్షణగా న్యాయవాదులు వారి యొక్క సమస్యలకు న్యాయం చేకూర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగం, మహేష్ చారి, వంశీ , శ్రీధర్ , శంకర్రావు,రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment