సిద్దిపేట అర్బన్, తెలంగాణ వార్త:
బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ గారి ఆధ్వర్యంలో సిద్ధిపేట లోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆయన మాట్లాడుతూ,
మూడు రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మరణించిన కంటోన్మెంట్ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జి.సాయన్న మరణించగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా అవమానించడం జరిగింది.
అందుకు గల సరైన కారణాలను కూడా ప్రభుత్వం చెప్పడం లేదు.అంటే ఎమ్మెల్యే సాయన్న పేద బహుజన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే కులవివక్షతో అవమాణించారని అర్థమవుతుంది.
గతంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణించినపుడు మరియు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరణించినపుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రజలకు సేవలందించిన సాయన్న మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి లింగంపల్లి యాదగిరి జిల్లా కోశాధికారి రోమాల బాబు, నాగని, స్వామి, స్వామి,డానియల్ స్థానిక బిఎస్పి నాయకులు పాల్గొన్నారు.
Leave a comment