తెలంగాణ వార్త: హైదరాబాద్లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో.. తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలతో.. టింబర్ డిపోలోని చెక్కలు తగలబడిపోయాయి. మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్ జోన్ పోలీసులు.. టింబర్ డిపోకు చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజిన్లతో.. ఫైర్ సేఫ్టీ సిబ్బంది.. మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు టింబర్ డిపోలో.. 11 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆ 11 మందిలో ఇప్పటివరకూ ఒకరి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మిగతా పది మంది గాయాలపాలయ్యారా.. మరేదైనా ప్రమాదంలో ఉన్నారా అన్నది అర్థం కాకుండా ఉంది. మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు.. సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మరణించిన కార్మికులకు సీఎం కేసీఆర్ తన తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బీహార్ కు చెందిన కార్మికులు కుటుంబాలకు సాయం చేస్తామని సీఎం తెలిపారు.
Leave a comment