Home హాట్ న్యూస్ మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ లకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి:: కేజ్రీవాల్
హాట్ న్యూస్

మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ లకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి:: కేజ్రీవాల్

తెలంగాణ వార్త: ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణపై ఆయన దృష్టి పెట్టారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ మంచి జోష్‌లో వుంది. కాంగ్రెస్ , బీజేపీ శిరోమణి అకాలీదళ్ వంటి రాజకీయ దిగ్గజాలను మట్టికరిపించి ఆప్ పంజాబ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ బలహీనతను క్యాష్ చేసుకుంటూ బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరిలో, వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు.

అటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలపైనా దృష్టి సారించనున్నట్లుగా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించగా, అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు కూడా తమ ప్రాంతాల్లో జోరు పెంచుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణలో త్వరలోనే ఆప్ పాదయాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఆ పార్టీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు.
మంగళవారం నాడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని భారతి తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా ఆప్ లక్ష్యాలను ఇంటింటికి తీసుకెళ్తామని సోమ్‌నాథ్ భారతి చెప్పారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డ భారతి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదంట ఫైరయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాడిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణలో పలు రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆప్ కూడా అదే సూత్రాన్ని ఫాలోకానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page