తెలంగాణ వార్త:: కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో భార్య భర్తలు కృష్ణ రజిత కూతురు బైక్పై వెళ్తుండగా జరిగిన స్థలంలోనే మృతి చెందిన కృష్ణ చిన్న కూతురు శరణ్య మృతి చెందినట్లు సమాచారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నవి.
తెలంగాణ వార్త:: కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నాడు రాత్రి సుమారు 10.30 గంటల సమయం లో ఇందిరమ్మ కాలనీ, కమ్మర్పల్లి కి చెందిన జాడి కిష్టయ్య S/o లింగన్న, వయస్సు: 36 సంవత్సరాలు, కులం: పద్మశాలి గారు అతని భార్య జాడి రజిత, వయస్సు: 33 సంవత్సరాలు, మరియు అతని ఇద్దరు కూతుళ్లు అయిన జాడి రాఘవి, వయస్సు: 12 సంవత్సరాలు, జాడి చరణ్య, వయస్సు: 08 సంవత్సరాలు లతో కలిసి తన బజాజ్ CT-100 బైక్ నెంబర్ TS16EL9464 గల దానిపై కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ వైపు వెళ్తుండగా కమ్మర్పల్లి శివారు లో గల ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరకి రాగానే ఒక గుర్తు తెలియని వాహనం టాక్కరు ఇవ్వగా రజిత, కిష్టయ్య మరియు రాఘవి లకు తలకి రక్త గాయాలు కాగా కిష్టయ్య అక్కడికక్కడే మరణించినాడు. రజిత నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించింది మరియు రాఘవి ని మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది. ఈ ప్రమాదం లో చరణ్య కు కుడి కాలికి గాయం అయింది ప్రస్తుతం చరణ్య నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పండుతున్నది. మృతురాలి తమ్ముడు అయినా దుర్గం మహేష్ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించానైనది.
Leave a comment