Home హాట్ న్యూస్ బిట్ కాయిన్ లో కోటి రూపాయలు ఫసక్ అయ్ పాయే.16 లక్షలకు పడిపోయిన బిట్కాయిన్..
హాట్ న్యూస్

బిట్ కాయిన్ లో కోటి రూపాయలు ఫసక్ అయ్ పాయే.16 లక్షలకు పడిపోయిన బిట్కాయిన్..

(తెలంగాణ వార్త) ఒకప్పుడు బిట్ కాయిన్ అంటే అప్పటికప్పుడు కోటీశ్వరులు అవుతామని ఆశ ఉండేది అది కాస్త ఆడి ఆశాయి ఇప్పుడు 16 లక్షలు పడిపోయింది దీంతో బిట్కాయిన్ కోట్ల రూపాయల్లో కొని నిండా మునిగిపోయారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసే కొందరు మహిళలతో స్నేహం ఉంది. బిట్‌కాయిన్‌, తదితర క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని వారి మాటల ద్వారా తెలుసుకుంది. సొంతంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఓ యాప్‌ ద్వారా పలు విడతలుగా మొత్తం రూ.90 లక్షలతో బిట్‌కాయిన్స్‌ కొనుగోలు చేసింది. ఆ యాప్‌లో యూఎస్‌ డాలర్ల రూపంలో పెట్టుబడులకు అధిక మొత్తంలో లాభాలు వస్తున్నట్లు కనిపించింది.

అయితే.. క్రిప్టో కరెన్సీ చేసే ట్రేడర్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ అకౌంట్‌లో ఉన్న రూ. 2 కోట్లలో సుమారు రూ. 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఉషారాణి బుధవారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన బినాన్స్‌లో ఈమెకు అకౌంట్‌ కూడా ఉంది. ఆ అకౌంట్‌లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది.

ఇటీవల ఉషారాణి అకౌంట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. యూఎస్‌డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 92 లక్షలను మన దేశ కరెన్సీ కింద కన్వెర్ట్‌ చేసి వివిధ అకౌంట్‌లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page