Home జనరల్ బాస్ ఈస్ బ్యాక్…
జనరల్

బాస్ ఈస్ బ్యాక్…

జనంలోకి ఘనంగా గులాబీ బాస్.. వరంగల్‌‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ..!
తెలంగాణ వార్త:::అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజల్లోకి వచ్చే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరోసారి జనాల్లోకి ఘనంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారు.
జనంలోకి ఘనంగా గులాబీ బాస్.. వరంగల్‌‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ..!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజల్లోకి వచ్చే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరోసారి జనాల్లోకి ఘనంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించా
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని.. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్‌ 27వ తేదీకి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్‌ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్‌ సమీపంలోని విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం (మార్చి 07న) రోజున జరిగిన సమావేశంలో పలువురు కీలక నేతలకో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌.. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అనంతరం పదేళ్ల పాటు ఎంతో అప్రమత్తతతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామన్నారు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోసపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భాల్లో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు.. కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే పరిమితం కాదని.. యావత్‌ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ప్రజలు బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీగా తమ సొంతింటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. వారి రక్షణ బీఆర్‌ఎస్‌ పార్టీనే అని నమ్ముతున్నారు.” అని కేసీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ఆశపెట్టిన గ్యారెంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపం తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారన్నారు.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page