తెలంగాణ వార్త:::సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో రోజు రోజుకూ రద్దీ ఎక్కువ అవుతోంది. ప్రయాణికులు కనీసం కూర్చొవడానికి కూడా చోటు లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పూర్తి చేశారు. ఇక్కడ నుంచే కొన్ని రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలా వరకు ట్రైన్స్ ప్రారంభం కాగా.. త్వరలో మరికొన్ని పట్టాలెక్కనున్నాయి. ఈ రకంగా.. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ, అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వీటిని తాత్కాలికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల అధికారి శ్రీధర్ తెలిపారు.

Leave a comment