నిజాంబాద్ జిల్లాలో సంచలనం రేపిన త్రిబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు ఆ.దివారం నిజామాబాద్ సి పి కార్తికేయ కమీషనరేట్ లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఈనెల 7న అర్ధరాత్రి డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హార్వెస్టర్ షెడ్యూల్ ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారని పోలీసులకు సమాచారం అందింది .వెంటనే అప్రమత్తమైన స్థానిక డిచ్పల్లి సి ఐ ,ఎస్ ఐ అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారు .హార్వెస్టర్ షెడ్డులో పంజాబ్ కు చెందిన హర్ పల్ సింగ్ (32) జోగిందర్ సింగ్ (46) సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొజ్జ నాయక్ తండాకు చెందిన క్రేన్ ఆపరేటర్ బానోత్ సునీల్( 25) హత్యకు గురైనట్టు గుర్తించారు. ముగ్గురు వేర్వేరు ప్రాంతాల కు కు చెందిన వ్యక్తులు హత్యకు గురికావడంతో పాత కక్షల నేపథ్యంలో జరిగిందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ..మూడు ప్రత్యేక బృందాలు ఏర్పడిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మూడు బృందాలను ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ చేయగా మొత్తం టీంలను అదనపు డీజీపీ అరవింద్ బాబు లీడ్ చేశారు. నేరం జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం అక్టోబర్ 12న గాజులు రామాపురం లోని జువైనల్ జైలు నుంచి విడుదలైన గంధం శ్రీకాంత్ పై అనుమానంతో విచారణ నిమిత్తం అతన్ని అదుపులోకి తీసుకున్నారు .ఈ విచారణలో కేసు కొలిక్కి వచ్చింది ఈ నెల 7న తేదీన రాత్రి ఒక్కడే డిచ్పల్లి కి వచ్చి హార్వెస్టర్ షెడ్డులో ఆరుబయట పడుకున్నా సునీల్ పై దాడి చేసి అతని వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కునే ప్రయత్నం లో అక్కడే ఉన్న సుత్తితో అతడి తలపై కొట్టి చేశాడు తరువాత షెడ్యూల్లో గాఢనిద్రలో ఉన్న హార్నర్ సింగ్ అలాగే జోగిందర్ తలపై కూడా బలంగా కొట్టి ఇ హత్యచేసి ఇ వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు రూ 3000 నగదు తీసుకొని శ్రీకాంత్ ఒప్పుకున్నాడు విచారణలో నేరం చేసినట్టు రుజువు కావడంతో అతనిని అరెస్ట్ చేశారు అనంతరం మరిన్ని వివరాలు సేకరించి ఉన్నారు