రంగారెడ్డి, తెలంగాణ వార్త: మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూర్ లోని సోమదేవుని చెరువులో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. రాష్ట్రంలో 88 కోట్ల చేప పిల్లలు వదలనుండగా, రంగారెడ్డి జిల్లాలో కోటి 60 లక్షల చేప పిల్లలు నీటి వనరుల్లో వదిలే కార్యక్రమంలో భాగంగా కందుకూర్ మండలంలో 20 చెరువులలో ఒక్క రోజే 6 లక్షల చేప పిల్లలు వదులుతున్నామని, చేపల మార్కెటింగ్ కు ఔట్ లెట్లు, ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్ వాహనాలను ప్రభుత్వం అందిస్తున్నందని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని చెరువులలో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకు పైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల వారికి సమాన ప్రాతిపదికన వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా మత్స శాఖ అధికారి సుకీర్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment