Home హాట్ న్యూస్ చేప పిల్లలను చెరువులో వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి…
హాట్ న్యూస్

చేప పిల్లలను చెరువులో వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

     రంగారెడ్డి, తెలంగాణ వార్త: మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూర్ లోని సోమదేవుని చెరువులో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేప పిల్లలను వదిలారు.
     ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.  రాష్ట్రంలో 88 కోట్ల చేప పిల్లలు వదలనుండగా, రంగారెడ్డి జిల్లాలో కోటి 60 లక్షల చేప పిల్లలు నీటి వనరుల్లో వదిలే కార్యక్రమంలో భాగంగా కందుకూర్ మండలంలో 20 చెరువులలో ఒక్క రోజే 6 లక్షల చేప పిల్లలు వదులుతున్నామని, చేపల మార్కెటింగ్ కు ఔట్ లెట్లు, ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్  వాహనాలను ప్రభుత్వం అందిస్తున్నందని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని చెరువులలో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకు పైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల వారికి సమాన ప్రాతిపదికన వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా మత్స శాఖ అధికారి సుకీర్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page