Home హాట్ న్యూస్ ఢిల్లీ కోటను బద్దలు కొడదాం మోడీ తోకను కత్తరిస్తాం.: పి యు సి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం మోడీ తోకను కత్తరిస్తాం.: పి యు సి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.


ఢిల్లీ కోటను బద్దలు కొడతం

-మోడీ సర్కారుకు మూడింది

-వడ్లు కొనే వరకు కొట్లాటే

-తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ

  • రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ

-తెలంగాణ అంటే ఎందుకంత కడుపు మంట

-మాటలు ఫుల్..నిధులు నిల్

-ఒక్క పథకం లోనైనా కేంద్రానిది నయా పైస వాటా ఉందా?

-పీయూష్ గోయల్ కాదు పీయూష్ “గోల్ మాల్”

-రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో చెక్క భజన ఆపాలి

-బీజేపీ ట్రిబుల్-ఆర్,కాంగ్రెస్ డబుల్-ఆర్ లను తరిమి కొడతాం

-రైతాంగం రగులు తుంటే రాహుల్ గాంధీ ఫిడేల్ వాయిస్తుండు

-ఎల్-3ఎంపీ అరవింద్ ను జిల్లాలో తిరగనివ్వం

  • బండి సంజయ్ వి తొండి మాటలు

-టూరిస్ట్ మంత్రి కిషన్ రెడ్డీ.. నువ్వే గట్టునుంటావు

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్7:- (తెలంగాణ వార్త)
దేశ వ్యాప్తంగా రైతులను,దళితులను, మైనార్టీలను, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌకలో గురువారం జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో జీవన్ రెడ్డి
మాట్లాడుతూ రైతాంగం ఉసురు పోసుకుంటున్న
మోడీ సర్కారుకు మూడిందని హెచ్చరించారు
తెలంగాణ రాష్ట్రంలో వడ్లను కొనాలన్న డిమాండ్ తో రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఢిల్లీపై దండయాత్ర కు రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం. వడ్లు కొనే వరకు మా కొట్లాట ఆగదు.
అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు. పంజాబ్ కో నీతి.. తెలంగాణకు మరో నీతా?నూకలు తినమని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాదు గోల్ మాల్. తెలంగాణ పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.
రైతులను అరిగోస పెడుతున్న బీజేపీ మట్టికొట్టుకొని పోతుంది.
తెలంగాణ అంటే ఎందుకంత కడుపు మంట.
బీజేపీ నేతలమాటలు ఫుల్..నిధులు నిల్.
ఒక్క పథకం లోనైనా కేంద్రానిది నయా పైస వాటా ఉందా?.కాళేశ్వరం ప్రాజెక్టు కు చిల్లి గవ్వయినా ఇచ్చారా?.రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో చెక్క భజన చేయడం ఆపాలి. రైతాంగం రగులు తుంటే రాహుల్ గాంధీ ఫిడేల్ వాయిస్తుండు. లోపల ముద్దులాట. బయట గుద్దులాట. చీమూ నెత్తురు ఉంటే పార్లమెంట్ లో గళం విప్పాలి.
లంగా, లపంగా, లత్కోర్ ఎంపీ అరవింద్ ను జిల్లాలో తిరగనివ్వం. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాటతప్పిన మోసగాడు. బండి సంజయ్ వితొండి మాటలు . నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. టూరిస్ట్ మంత్రి కిషన్ రెడ్డి ఏ గట్టు నుంటారో తేల్చుకోవాలి.
బీజేపీ నేతలు వడ్లు కొనమని కేంద్రం పై వత్తిడి తేవాలి. వట్టి చేతులతో వస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు తరిమి కొడతం. బీజేపీ ట్రిబుల్-ఆర్,కాంగ్రెస్ డబుల్-ఆర్ లను, తొండి సంజయ్, టూరిస్ట్ మంత్రి కిషన్ రెడ్డి లను తిరగనిచ్చే ప్రసక్తే లేదు అనిజీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
వడ్లు కొనాలని రోడ్లు ఎక్కిన రైతుల ఆవేదన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతుల మేలు కోరే వాళ్ళు అయితే పార్లమెంట్‌లో మా ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలి.
రైతుల పక్షాన నిల్వకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.
రైతులపై కూడా రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. పరువు పోతుందన్నారు. రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడలేదన్నారు.ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ కాంగ్రెస్ సర్వ నాశనమైంది.. రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన టీడీపీ ప్రభుత్వం కూలిపోయి ఆ పార్టీ ఆఫీసు కు టూ-లెట్ బోర్డు తగిలించారన్నారు. రైతులతో పెట్టుకున్న ప్రధాని మోడీకి పంజాబ్ లో గుండు సున్నా మిగిలిందన్నారు. రైతేడ్చిన రాజ్యం,ఎద్దేడ్చిన వ్యవసాయం బాగు పడదన్నారు. 2కోట్ల50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నారని, ఆయన కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ 23లక్షల కోట్లను ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఆయన ఆరోపించారు.13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేత దారులను, వైట్ కాలర్ నేరస్తుల ను, కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను దేశం దాటించిన నీచమైన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పదేపదే పెంచి లక్షల కోట్లు దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కు 13వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ది ప్రజా ప్రభుత్వ మన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10,000ల చొప్పున ఇప్పటికే 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5,00,000ల చొప్పున చెల్లించే బీమా అమలు చేస్తున్నాం. ఇరవై నాలుగంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా పోతున్నాం. కేవలం రైతు సంక్షేమం కోసమే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మాది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం లోనైనా కేంద్రానిది నయాపైసా వాటా ఉందా అని ఆయన నిలదీశారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల టీఆర్ఏ స్ పార్టీ అధ్యక్షులు అద్భుతమైన కృషి చేస్తున్నారని, రైతు ఉద్యమ కార్యాక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలో జరగనున్న ఆందోళన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఆర్టీసీ చైర్మన్,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త,ఎమ్మెల్సీలు వీజి గౌడ్, రాజేశ్వర్, జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, రెడ్కో చైర్మన్ అలిం, నగర మేయర్ నితూ కిరణ్ పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page