శుక్రవారం రోజు లింగంపల్లి డివిజన్ సురభి కాలనీ నుండి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకట్ భాను ,సాయిరాం ల మిత్ర బృందం మరియు కాలనీ వాసులు గతంలో బిక్షపతి యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధి, రవికుమార్ యాదవ్ గారి నాయకత్వానికి , నేడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని , కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని , రాబోయే ఎన్నికల్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు, సురభి కాలనీకి గతంలో మానాన్న గారు బిక్షపతి యాదవ్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ 8 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన , ఏ సమస్య వచ్చిన మీకు నేను, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వారికి హామీ ఇచ్చి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంట్స్తెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఏల్లేష్ , సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ , ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
Leave a comment