ఆర్మూర్( తెలంగాణ వార్త) నందిపేట మండలం నందిపేట గ్రామంలో పునర్నిర్మాణం జరుగుతున్న ముత్యాలమ్మ పోచమ్మ చిలుకల చిన్నమ్మ మందిరాల విగ్రహాల కొరకు శ్రీ శ్రీ శ్రీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి గారి సమక్షంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య రాములు మహారాజ్ గారికి శ్రీ మచర్ల సాగర్ నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక లక్ష 1,12,116 రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. సనాతన కాలం నుండి ఈ గ్రామ దేవతల కరుణాకటాక్షాల వల్లనే గ్రామ పొలిమేరలో రక్షణ కవచంలాగా గ్రామ దేవతలు గ్రామాన్ని గ్రామ ప్రజలను రక్షిస్తూ ప్రజలకు సుఖశాంతులను అందిస్తున్నాయని, గ్రామ దేవతలను పూజించడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు భూత, ప్రేత భయాలు తొలగి మనుషుల మానసిక పరిపక్వత పెరిగి ఆరోగ్యకర జీవనంతో సంతోషమయం కలుగుతుందని పాడిపంటలు చల్లంగా ఉంటున్నాయని,అందుకే గ్రామదేవతల ఆలయ పునర్నిర్మాణానికి నా పూర్వీకుల జ్ఞాపకార్థం ఆలయ నిర్మాణానికి తనకు తోచిన సాయం చేశానని నందిపేట్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచర్ల సాగర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నందిపేట్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Leave a comment