ఆర్మూర్(తెలంగాణ వార్త): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి గారు పట్టణంలోని పలువురుని పరామర్శించినడానికి విచ్చేసిన సందర్భంలో భాగంగా అతిథిగృహంలో తేనీటి విందు స్వీకరించి కాసేపు మీడియా మిత్రులతో మాట్లాడారు. అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య సమాచారం మరియు హెల్త్ కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టి మురళి, గౌరవ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్,సలహాదారు పొన్నాల చంద్రశేఖర్, దొండి మోహన్, జాన గౌడ్, క్రాంతి,సందీప్ తదితర మిత్రులు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ భావన నిర్మాణం గురించి అడుగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి క్లబ్ నిర్మాణం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
Leave a comment