(తెలంగాణ వార్త) నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై ఎమ్మెల్సీ కవిత దృష్టి సారించారు. దీంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ది పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిదులను విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపి) ద్వారా నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. బోధన్ మండలంలోని మినార్ పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్, నవీపేట్ మండలం పొతంగల్ గ్రామంలో రూ.50 లక్షలతో పాఠశాల భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత నిధులు విడుదల చేయించారు. బోధన్ మున్సిపాలిటీలోని 37 వ వార్డులో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Leave a comment