రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈరోజు ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్ పంకజ గారు జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించడం జరిగింది.
ప్రతి వార్డుకు ఒక్క మాన్సూన్ వాహనం అనగా మొత్తం 23 వార్డులకు 23 ట్రాక్టర్ / టాటా వాహనాలు అందులో నలుగురు లేబర్ మరియు 12 స్టాటిక్ టీమ్స్ 2 లేబర్ అందుబాటులో ఉంటారు.
రానున్న వర్షాకాలంలో అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. వి. హరిలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కప్రా, శ్రీ. నాగేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఉప్పల్, శ్రీ. కె. రమేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హయత్ నగర్ సర్కిల్, శ్రీ కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎల్బీ నగర్, శ్రీ. శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సరూర్ నగర్ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Leave a comment