Home హాట్ న్యూస్ ఘనంగా జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలు…
హాట్ న్యూస్

ఘనంగా జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలు…


ఆర్మూర్, తెలంగాణ వార్త: ప్రముఖ రైతు నాయకుడు TRS పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు 63వ జన్మదిన వేడుకలు ఈరోజు ఆర్మూర్ లో ఘనంగా నిర్వహించారు. కోటపాటి తన జన్మ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి పెద్ద ఎత్తున జరుపు కోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం యువకులను సామాజిక సేవ వైపు మళ్ళించడానికి ఉద్దేశించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 175 మందితో రక్త దానము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారికి అందించారు. ఇట్టి రక్తదాన శిబిరాన్ని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ మరియు నిజామాబాద్ రూరల్ నుండి యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు . అంతకుముందు ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా నుండి మామిడిపల్లి విజయలక్ష్మి గార్డెన్స్ వరకు “ రక్తదానా అవగాహన ర్యాలీ ” నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సామాజిక సేవ కోసమై యువకులను ప్రేరేపించడానికై ఇప్పటికే సామాజిక సేవ చేస్తున్న యువకులు యువజన సంఘాలు, యూత్ క్లబ్ మరియు సామాజిక సేవ సంఘాలను గుర్తించి సుమారుగా 70 మందిని సత్కరించి ప్రశంసా పత్రమును అందజేశారు .పురస్కారము అందుకున్న వారిలో ఆర్మూర్ ,గాంధీ, గోవింద్ పెట్ సర్పంచ్ గంగాధర్ అర్గుల్ గ్రామ సర్పంచ్ గొర్త రాజేందర్ (కోవిడ్ సందర్భంగా మృతులకు దహన సంస్కారాలు) జంగం బాలకిషన్, మహమ్మద్ ఇబ్రహీం సల్మాన్ రాజ్ భీంగల్ , కుంట దశ గౌడ్ గల్ఫ్ కార్మికుల సేవా, శ్రీమతి అమీనా బేగం ముక్తాల్, మాసం గోపి ముక్తాల్, MSP ఫౌండేషన్ నందిపేట్ గార్లు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విభాగం కొక్కుల విద్యాసాగర్ ఆర్మూర్, ఎం పురుషోత్తం నిజాంబాద్, కోళ్ల రాజేశ్వర్ మోతే, బోయ స్వామి బ్రాహ్మణపల్లి, నరసింహ రెడ్డి నిజామాబాద్, బి ప్రవీణ్ తదితరులు రక్తదాన విభాగం, తాడు మహేష్ హెల్పింగ్ హాండ్స్ రామచంద్ర పల్లి ,అప్పల గణేష్ గోవింద్ పెట్, పట్టారి తులసి కుమార్ ఆర్మూర్, దశరథం శ్రీరామ్ సాగర్ చిన్న రమేష్ పల్లెడా, అరవింద్ భీంగల్ ,బోనగిరి నర్సారెడ్డి తాళ్ళరాంపూర్ , చెక్వీర్ యూత్ సాయిరాజ్ యాదవ్, కస్తూరి శ్రీకాంత్ పురానిపేట్, రవీందర్ ఏ జప తుర్తి మరియు ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు ఇందల్వాయి కిషన్ గార్ల అందరికీ వారు చేస్తున్న ఒక్కో రంగంలో ఎంపిక చేసి ప్రశంశ పత్రంతో కోటపాటి నరసింహం నాయుడు సత్కరించి బావి తరాలకు స్ఫూర్తిని నింపారు ఈ కార్యక్రమ నిర్వహణ జక్కుల శ్రీధర్ న్యాయవాది కన్వీనర్ గా వ్యవహరించారు విజేతలను ఎంపిక చేయడానికి వి.బాలయ్య న్యాయవాది గారి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ కన్వీనర్ గా కోటపాటి శివకృష్ణ, రాగాల అశోక్ కార్తీక్ సాయి పురటి సాయి, రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page