రవీందర్ యాదవ్ కు గవర్నర్ ప్రశంసలు..
సేవా కార్యక్రమాలపై జిష్ణుదేవ్ వర్మ ఆరా
తెలంగాణ వార్త ::భవిష్యత్ లో తాను సైతం పాల్గొంటానని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శేరిలింగంపల్లి భారాస సీనియర్ నేత, తెలంగాణ సోషియో కల్చరల్ అకాడమీ ఛైర్మన్, తెలంగాణ యూత్ ఐకాన్ అవార్డు గ్రహిత రవీందర్ యాదవ్ ను ప్రశంసించారు. తెలంగాణ సోషియా కల్చరల్ అకాడమీ తరుపున ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ లో నిర్వహించబోయే సేవా కార్యక్రమాలకు తాను కూడా పాల్గొంటానని రవీందర్ యాదవ్ కు హామీ ఇచ్చారు. శుక్రవారం సోమాజిగూడలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పేద వారికి తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. గవర్నర్ సైతం ఆసక్తిగా సేవా కార్యక్రమాలను, పేదలకు చేస్తున్న మంచిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించాలని రవీందర్ యాదవ్ కు సూచించారు. సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని, వారికి రవీందర్ యాదవ్ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ కితాబిచ్చారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి తనకు సైతం ఉంటుందన్నారు. రవీందర్ యాదవ్ కు మంచి భవిష్యత్ ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.
Leave a comment