బిల్లులు కట్టలేక లబోదిబో అంటున్న జనాలు…
*ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతా * రవి కుమార్ యాదవ్
కొండాపూర్ ,తెలంగాణ వార్త :శుక్రవారం కొండపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో బస్తీ వాసుల పిలుపుమేరకు వెళ్లి పర్యటించడం జరిగింది. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ జరిగే టైం లో ఓట్ల కోసం మంత్రి కేటీఆర్ గారు ఒక రూపాయికే నల్ల కనెక్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక ఇప్పుడు స్థానిక ప్రజలపై ఏకకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు తెలియజేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నా మానసపుత్రికలని, అందరికీ 20000 లీటర్ల వరకు మంజీరా నీరు ఉచితంగా ఇవ్వడం నా లక్ష్యం అని చెప్పుకునే కెసిఆర్ పేద వారికి వేల రూపాయల వాటర్ బిల్లులు వేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని , వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అని బాకాలు కొట్టుకోవడం తప్ప , కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆయన గారు పేదలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు, స్థానికుల సమక్షంలో వాటర్ బోర్డ్ మేనేజర్ గారితో మాట్లాడి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు, వారు కూడా పరిశీలించి బిల్లులు కట్టకుండా చూస్తామని , వాటర్ కనెక్షన్లు కట్ చేయమని హామీ ఇచ్చారు , స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేసే దిశగా అధికారులతో మాట్లాడి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ యాదవ్, గోపాల కృష్ణ, రాజు , రెహ్మతుల్ల, నర్మద, నాగమణి, నర్సమ్మ మొదలగు వారు పాల్గొన్నారు
Leave a comment