ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ పట్టణములోని 2 వ వార్డు పరిధిలోని మంగళవారం జిరాయత్ నగర్లో హనుమాన్ మందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో సద్దుల బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ కౌన్సిల్ మెంబర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ విచ్చేసి మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమములో తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, హనుమాన్ మందిర అభివృద్ధి కమిటీ అద్యక్షులు మానకొండూరు భాస్కర్, ప్రధాన కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి విట్టోభా శేఖర్, ప్రతినిథులు కర్తను నవీన్, రవీందర్ రెడ్డి, రాం ప్రసాద్, ప్రవీణ్, భరత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు
Leave a comment