హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగత
నిజామాబాద్, (తెలంగాణ వార్త) మార్చి 19 : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాదు ఆర్దీవో రవి, మత్స్య శాఖ ఏ.డీ ఆంజనేయ ప్రసాద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
Leave a comment