తెలంగాణ వార్త ::
ఆదివారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతోంది. టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడనో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతోంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
ప్రతి మ్యాచ్‌ని నాకౌట్‌ని తలపించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్‌కు చేరుకుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ టోర్నీ మార్చి 9న దుబాయ్‌లో ముగియనుంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్‌లు ఫైనల్ బరిలో అడుగుపెట్టాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యా గ్రూప్ ఏలో ఆడిన భారత్, న్యూజిలాండ్ జట్లే ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు.. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అప్ఘనిస్తాన్ జట్లు ఆడాయి. గ్రూప్ ఏ నుంచి టాప్ 2లో నిల్చిన భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు ఎంపిక కాగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్స్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు పోటీపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్, లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది…

Leave a comment